HomeMovie NewsPushpa 2 Struggling for Premier Bookings ప్రీమియర్ బుకింగ్స్ లో స్ట్రగుల్ అవుతున్న 'పుష్ప...

Pushpa 2 Struggling for Premier Bookings ప్రీమియర్ బుకింగ్స్ లో స్ట్రగుల్ అవుతున్న ‘పుష్ప – 2’

- Advertisement -

టాలీవుడ్ స్టైల్ సైకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. రేపు గ్రాండ్ గా ఈ మూవీ పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే నేడు రాత్రి 9:30 నుంచి పలు ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శన కానున్నాయి. మరోవైపు ప్రీమియర్ టికెట్స్ పరంగా పుష్ప 2 స్ట్రగుల్ అవుతోంది.

ఇక ఈ సినిమా ప్రీమియర్స్ కి టికెట్ ధర రూ. 900 నుండి రూ.1200 లుగా నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఇవి ఇప్పటివరకు కూడా 50% మాత్రమే ఆక్యుపెన్సీ కలిగి ఉన్నాయి. ధరలు చాలా ఎక్కువ ఉండటంతో కొందరు అభిమానులు సైతం అవి కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.

మరోవైపు మెగా ఫ్యాన్స్ తో కోల్డ్ వార్ కొనసాగుతూ ఉండటంతో వారు కూడా ఈ టికెట్స్ ని కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. ఒకరకంగా చూస్తే ప్రీమియర్స్ పరంగా పుష్ప 2 కి ఒకంత దెబ్బ అయితే పడేలా కనపడుతుంది. అయితే మంచి టాక్ కనుక లభిస్తే ఈ సినిమా రేపటి నుంచి భారీ స్థాయి కలెక్షన్ అందుకునే అవకాశం గట్టిగా కనబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు

Follow on Google News Follow on Whatsapp

See also  Kalki 2898 AD Ruling in America అమెరికాలో రూల్ చేస్తున్న 'కల్కి 2898 ఏడి'


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories